మేత / ఆహారం

 

గొర్రెల పోషణలో మొదలు అతి ముఖ్యమయినది ఆహారం. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి సరిపడా పచ్చిక బయళ్ళు చాలా అవసరం. ఎందుకంటే ఎలాంటి మిశ్రమ దాణా లేకపోయినప్పటికీ బయళ్ళలో దొరికే పచ్చిక మేసి గొర్రెలను పెంచుకోవచ్చు. చాలా చోట్ల ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు పచ్చిమేత దొరకదు. కనుక గొర్రెలు ఆకలితో చచ్చిపోతాయి.   అటువంటప్పుడు కేవలం అవి మేసే గడ్డి మీద ఆదారపడకుండా గొర్రెలు తినే ఆహారంలో కనీసం 8 శాతం వరకు సమీకృత దాణా మనం ఇచ్చినట్లు అయితే గొర్రెల నుంచి అధికోత్పత్తి సాదించవచ్చు.